Eenadu.us

The Complete News Site

మాజీ మంత్రి కొండా సురేఖ, సుదీర్ఘ బహిరంగ లేఖ

# ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖ గుడ్ బై చెప్పారు. ఆమెతో పాటు ఆమె భర్, ఎమ్మెల్సీ కొండా మురళి కూడా గుడ్ బై చెప్పారు.

# వారిద్దరూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

# ఈ సందర్భంగా కేసిఆర్ కు రాసిన సుదీర్ఘ బహిరంగ లేఖను విడుదల చేసి టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు.

# లష్కర్ బోనాల పండుగనాడు బంగారు బోనం ఎత్తుకోవడానికి కవిత కు ఉన్న అర్హత ఏమిటని నిలదీశారు.

# మందు గోలీలు, మంచినీళ్లు ఇచ్చే సంతోష్ రావును రాజ్యసభకు పంపిన కేసిఆర్ అమర వీరులను మాత్రం నాలుగేళ్ల కాలంలో పట్టించుకున్న పాపాన పోలేదు

# రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండు కేటిఆర్ అంటూ సవాల్ చేశారు :కొండా సురేఖ.

# రానున్న రోజుల్లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చే చాన్స్ లేనే లేదని ఆమె తేల్చి చెప్పారు: కొండా సురేఖ

# ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించలేని అసమర్థ సర్కారు కేసిఆర్ దే అని మండిపడ్డారు.

# చెన్నూరులో ఆత్మహత్య చేసుకున్న గట్టయ్య ఆత్మ శాంతించాలంటే టిఆర్ఎస్ ను ఓడించాల్సిందే అని తేల్చి చెప్పారు : Konda Sureka.

# మహా కూటమిని విమర్శిస్తున్న కేసిఆర్ బిజెపితో లోపాయికారి ఒప్పందం చేసుకోలేదా అని నిలదీశారు.

# బిజెపితో ఒప్పందంతోనే కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు పోతున్నాడని ఎద్దేవా చేశారు.

# రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శిస్తున్నారని తెలంగాణ వచ్చిందే సోనియా పుణ్యమన్నారు.

# కోదండరాంని బంగారం లాంటి మనిషని పొగిడి నేడు దద్దమ్మ, సన్నాసి సర్పంచ్ గానైనా గెలిచిండా అని ప్రశ్నించడమేంటని విమర్శించింది.

# తెలంగాణ మొత్తం అవినీతి మయమైందన్నారు. ఫాం హౌజ్, క్యాంపు ఆఫీసు సక్కగా ఉంటే బంగారు తెలంగాణ సాధ్యం అయినట్టు కాదని ప్రజలు బాగున్నప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు.

# కేటిఆర్ కాంట్రాక్టర్ల వద్ద నుంచి డబ్బులు దండుకుంటున్నాడని ఆయన కమీషన్ల రాజుగా మారాడని విమర్శించింది.

# తెలంగాణ కేసీఆర్ కుటుంబ సొత్తు కాదని విమర్శించారు.

# టిఆర్ఎస్ లో ఉన్నంత కాలం మేము హరీషన్న వర్గమే అని తేల్చి చెప్పారు కొండా సురేఖ. ఆయనకు ఎంత భాద ఉంటే అలా మాట్లాడుతాడు అని ఆవేదన వ్యక్తం చేశారు.

# రాజకీయాల్లోంచి తప్పుకోవాలన్న ఆలోచన కలిగిందని నైరాశ్యంతో హరీష్ రావు మాట్లాడితే బాధనిపించిందన్నారు.

# నాలుగైదు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని కొండా సురేఖ తెలిపారు.

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com