Eenadu.us

The Complete News Site

‘కేసీఆర్’ మాస్టర్ ప్లాన్…! ‘హరీష్’ చుట్టూ బిగుసుకున్న ఉచ్చు..!

‘కేసీఆర్’ మాస్టర్ ప్లాన్…! ‘హరీష్’ చుట్టూ బిగుసుకున్న ఉచ్చు..!

ముందస్తు ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ డేంజర్ గేమ్ కు తెరతీశారా..? తన వారసుడు కేటీఆర్ కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమని సంకేతాలిస్తున్నారా..? ఫ్యూచర్ లో ఎవరూ అడ్డురాకుండా పావులు కదుపుతున్నారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జగ్గారెడ్డి మానవ అక్రమ రవాణా కేసులో ఆయన కేవలం పావు మాత్రమే అంటున్నారు కొందరు నేతలు. హరీష్ టార్గెట్ గా జగ్గారెడ్డిపై కేసు పెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగ్గారెడ్డి అరెస్ట్ అవడం.. తన వాంగ్మూలంలో హరీష్ రావు, కేసీఆర్ పేరు చెప్పడంతో కేసు కీలక మలుపు తిరిగింది.

నిజానికి జగ్గారెడ్డి అరెస్ట్ వెనుక పెద్ద స్కెచ్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. 2004లో జగ్గారెడ్డితో సహా పలువురు మెదక్ నేతలపై మనుషుల అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు హరీష్ రావు. కేసీఆర్ పేరు కూడా ఉంది. కానీ కేవలం జగ్గారెడ్డి అరెస్ట్ మాత్రమే ఎందుకిప్పుడు..? అంటే అదో బ్రహ్మపదార్థం. సాంకేతిక అంశాలనుపక్కనపెడితే… ఇదే కేసులో మహ్మద్ షకీల్ తన వాంగ్మూలంలో కేసీఆర్, హరీష్ పేర్లున్నాయి. షకీల్ వాంగ్మూలంలో జగ్గారెడ్డి పేరులేకపోవడం మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. దాని సంగతి పక్కనపెడితే…. జగ్గారెడ్డి కూడా తన వాంగ్మూలంలో కేసీఆర్, హరీష్ రావు పేర్లను పేర్కొన్నారు. నిజానికైతే వాళ్లిద్దర్నీ కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలి. కానీ పోలీసు వ్యవస్థ అలా పనిచేయదు కదా. పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షకు ఉపయోగిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

నిజానికి దీని వెనుక పెద్ద వ్యూహం ఉందని ప్రచారం జరుగుతోంది. విజయక్రాంతి పేపర్ లాంచింగ్ రోజు హోటల్ మారియట్ తో అమిత్ షాని.. హరీష్ రావు సీక్రెట్ గా కలిశారన్నప్రచారం జరిగింది. సీఎం సీటుతో సహా హరీష్ చెప్పిన వాళ్లందరికీ ఎమెల్యే టికెట్లు ఆఫర్ చేశారని… దానికి హరీష్ రావు కూడా సుమఖత వ్యక్తం చేశారన్న ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డితో సహా చాలామంది ప్రతిపక్ష నేతలు పదేపదే ఈ విషయాన్ని చెప్తూ వచ్చారు. అక్కడ్నించే కేసీఆర్ గేర్ మార్చి గేమ్ ఛేంజ్ చేశారని గులాబీ నేతలు చెప్తున్నారు. ఆఘమేగాల మీద ఢిల్లీ వెళ్లి మోడీ ముందు మోకరిల్లి ముందస్తుకు ఒప్పించారని ప్రతిపక్షాల ఆరోపణ. సార్వత్రిక ఎన్నికల దాకా గ్యాప్ దొరికితే… షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే… హరీష్ థ్రెట్ అవుతాడన్న భయంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారని ఓ టాక్. ఇప్పటికే ముందస్తుతో మరోసారి అధికారంలోకి వస్తామన్న ధీమా వచ్చింది కాబట్టే.. హరీష్ ను లాక్ చేద్దామని మనుషుల అక్రమ రవాణా కేసును తెరపైకి తెచ్చినట్టు ప్రతిపక్ష నేతలు చెప్తున్న మాట. హరీష్ రావును భయపెట్టేందుకే జగ్గారెడ్డి కేసును శాంపిల్ గా చూపించారన్న ప్రచారం జరుగుతోంది. తోక జాడిస్తే నెక్స్ట్ టార్గెట్ హరీష్ రావే అన్న వాదనలూ గులాబీ శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి. అది మెడకు చుట్టుకుంటే… హరీష్ రావు జీవితాంతం వెంటాడే కేసు అవుతుంది. అదే జరిగితే… తనవారసుడు కేటీఆర్ కు లైన్ క్లియర్ అవుతుందన్నది వ్యూహం. అందుకే మనుషుల అక్రమ రవాణా కేసు తెరమీదకు తెచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనితో సీఎం సీటు తనకొద్దు అని హరీష్ తోనే చెప్పించే వ్యూహానికి తెరతీసినట్టు ప్రచారం జరుగుతోంది

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com