Eenadu.us

The Complete News Site

17 నుంచి ఇంటర్‌ పరీక్ష ఫీజు

హైదరాబాద్‌, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను తెలంగాణ ఇంటర్‌బోర్డు సోమవారం ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబరు 24వ తేదీ వరకు విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. ఇక జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులకు కేవలం థియరీ పరీక్షలకు పరీక్ష ఫీజు రూ. 460, థియరీ, ప్రాక్టికల్‌ పరీక్షలకు రూ. 620, బ్రిడ్జ్‌ కోర్సు చేసే వారికి ప్రాక్టికల్స్‌ ఫీజు రూ. 170, థియరీ పరీక్ష ఫీజు రూ. 120, జనరల్‌ విద్యార్థులు మ్యాథ్స్‌ లేదా సెకండ్‌ లాంగ్వేజ్‌ అడిషనల్‌ సబ్జెక్టుగా తీసుకున్న వారికి రూ. 460 ఫీజు ఉంటుంది.
బీడీఎస్ లో 112సీట్లు మిగులు
దంత వైద్య విద్యలో ఈ ఏడాది మేనేజ్‌మెంట్‌ కోటాలో సీటు పొందిన వారిలో 28 మంది ఆ కోర్సులో చేరలేదని కాళోజీ వర్సిటీ వెల్లడించింది.

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com