Eenadu.us

The Complete News Site

వీఆర్వో పరీక్ష కేంద్రాల్లో స్వల్పమార్పులు

హైదరాబాద్: వీఆర్వో పరీక్షకు సంబంధించిన కేంద్రాల్లో స్వల్పమార్పులు చేసినట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. సరూర్‌నగర్‌లోని ప్రగతి మహిళా డిగ్రీ కళాశాలలో (సెంటర్‌కోడ్- 39124) పరీక్షకు హాజరుకావల్సిన 600 మంది (హాల్‌టికెట్ నంబర్ 1339063388 నుంచి 1339063987 వరకు) పరీక్షాకేంద్రాన్ని దిల్‌సుఖ్‌నగర్‌లోని నారాయణ జూనియర్ కళాశాలకు (బాయ్స్) మార్చారు. సరూర్‌నగర్ శ్రీచైతన్య కాలేజీలోని (సెంటర్-39133) 500 మంది (1339068548-1339069047) పరీక్ష కేంద్రాన్ని మూసారాంబాగ్‌లోని నారాయణ జూనియర్ కాలేజీకి (బాలికలు) మార్చారు. దిల్‌సుఖ్‌నగర్ న్యూనోబుల్ డిగ్రీ కాలేజీ (సెంటర్-39137)లోని 450 మందికి (హాల్‌టికెట్ నంబరు 1339070504 నుంచి 1339070953) మూసారంబాగ్‌లోని వెలాసిటీ కాలేజీలో పరీక్షకు ఏర్పాట్లు చేశారు.

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com