Eenadu.us

The Complete News Site

తీగల కృష్ణారెడ్డి తెలంగాణ ద్రోహి అన్న కొత్తమనోహర్ రెడ్డి

మహేశ్వరం నియోజకవర్గం టికెట్ ను కేసీఆర్ తీగల కృష్ణారెడ్డికి ఇవ్వడంపై కొత్త మనోహర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన మనోహర్ రెడ్డి ఓడిపోగా, టీడీపీ టికెట్ పై పోటీచేసిన తీగల కృష్ణారెడ్డి విజయం సాధించారు.

అనంతరం కృష్ణారెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా ఈ ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం కృష్ణారెడ్డికి టికెట్ కన్ఫామ్ చేయడంపై కొత్త మనోహర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

తీగల కృష్ణారెడ్డి తెలంగాణ ద్రోహి అనీ, టీఆర్ఎస్ లోకి వచ్చి తన రాజకీయ భవిష్యత్ ను నాశనం చేశాడని మనోహర్ ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో కృష్ణారెడ్డిని ఓడించడమే తన లక్ష్యమనీ, ఇందుకోసం ఇంటిపెండెంట్ గా పోటీచేసి భారీ మెజారిటీతో గెలుస్తాననీ, ఈ సీటును కేసీఆర్ కు బహుమతిగా ఇస్తానని మనోహర్ రెడ్డి వెల్లడించారు.

కొత్త మనోహర్ రెడ్డి మహేశ్వరం కాంటెస్ట్ ఎమ్మెల్యే….

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com