Eenadu.us

The Complete News Site

జగ్గారెడ్డి అరెస్ట్ పై కాంగ్రెస్ నేతల ఫైర్…


జగ్గారెడ్డి అరెస్ట్‌పై టి.కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వక్తం చేస్తున్నారు. పోలీసులు… కేసీఆర్ తొత్తులుగా మారారంటూ విమర్శిస్తున్నారు. రాత్రి తెలంగాణ డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఉన్న జగ్గారెడ్డి దగ్గరకు వెళ్లి పరామర్శించారు. గులాంనబీ ఆజాద్ సభకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కుట్రపూరితంగా అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగ్గారెడ్డి అరెస్ట్‌కు నిరసనగా ఇవాళ సంగారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌, రేవంత్‌రెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, భట్టివిక్రమార్క, షబ్బీర్‌ అలీ, సంపత్‌… కుందన్ బాగ్‌లోని డీజీపీ ఇంటికి వెళ్లారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జగ్గారెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో పోలీసులు కేసీఆర్‌ తొత్తులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జగ్గారెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారని మండిపడ్డ నేతలు… కేసీఆర్ మాటవిని అక్రమంగా జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారని ఆరోపిఆంచారు. 2004లో ఎఫ్ఐఆర్ అయిన కేసులో ఇప్పుడు అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించిన ఉత్తమ్… 2004లో నమోదైన అక్రమ ఇమ్మిగ్రేషన్ కేసులో కేసీఆర్, హరీష్ రావు కూడా నిందితులుగా ఉన్నవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

డీజీపీ ఇంటికి ఉత్తమ్‌

జగ్గారెడ్డి అరెస్టు నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌, సునీతా లక్ష్మారెడ్డి, ఇతర నేతలు సోమవారం అర్ధరాత్రి డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కుందన్‌బాగ్‌లోని డీజీపీ ఇంటికి వెళ్లారు. అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ కేసీఆర్‌కు ఏజెంట్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌, హరీశ్‌లపైనా నకిలీ పాస్‌పోర్టు ఆరోపణలున్నాయని.. వారిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. జగ్గారెడ్డిని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో నిర్బంధించినట్లు తెలుసుకున్న కాంగ్రెస్‌ నేతలు డీజీపీ నివాసం నుంచి సరాసరి అక్కడికి చేరుకున్నారు.

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com