Eenadu.us

The Complete News Site

ఆసక్తికర విషయం చెప్పిన మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్‌

హైదరాబాద్: రూపాయి ఖర్చుపెట్టి ఏ నాడు ఓటు అడగలేదని మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు రూపాయి కూడా లంచం ఎవరి దగ్గరా తాను తీసుకోలేదని ప్రజలంటే తనకు అంత గౌరవమని ఆయన స్పష్టం చేశారు. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
బాబు మోహన్ మాటల్లోనే..
” పొలిటీషియన్‌గా అబద్ధమాడను.. తప్పుచేయను. అబద్ధమాడిన వాడిని వదిలిపెట్టను ఇదీ నా క్యారెక్టర్. రాజకీయాల్లో 24 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ప్రజలకు సేవలు చేసి వారి దీవెనలు పొందాలనే ఆలోచిస్తాను తప్ప జనం మీద పడి వసూళ్లు చేద్దామని నేను ఎప్పుడూ అనుకోలేదు.. అనుకోను కూడా అలా చేయడం నా క్యారెక్టర్ కాదు. అప్పట్లో జరిగిన ఎమ్మార్వో వివాదం అంతా ఓ కీలకనేత డబ్బులిచ్చి మీడియాలో రాయించారంతే.. ఇదంతా నాపై కక్షగట్టి చేశారు. కావాలనే క్రియేట్ చేశారంతే అంతకుమించి ఏమీ లేదు. ప్రజలకు నిజానిజాలేంటో తెలుసు” అని బాబు మోహన్ క్లారిటీ ఇచ్చారు.

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com