Eenadu.us

The Complete News Site

అధికార పార్టీ లో రాజుకున్న టికెట్ల గోల…

ఉమ్మడి నల్లగొండ జిల్లా లోని తుంగతుర్తి నోయోజకవర్గం లో మొదలైన నిరసన సెగలు…తుంగతుర్తి నియోజకవర్గం లో 2014 లో స్థానికేతరుడయిన గాదరి కిషోర్ కి టిఆర్ఎస్ పార్టీ టికెట్ లభించింది.అయినప్పటికీ అతను అతి స్వల్ప మెజారిటీ తో గెలిచాడు..మాదిగ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం లో మాల సామాజిక వర్గానికి చెందిన గాదరి కిషోర్ కి టికెట్ లభించడం తో,మాదిగ సామాజికవర్గం తో పాటుగా 2001 లో టిఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పటి నుండి పార్టీకి స్థానికంగా సేవ చేసిన వారు అసంతృప్తికి లోనయ్యారు.అయినప్పటికీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండి గాదరి కిషోర్ విజయానికి కృషి చేసి గెలిపించారు.ఎమ్మెల్యే గా గెలిచిన నాటి నుండి గాదరి కిషోర్,మొదటి నుండి ఉద్యమం చేసిన వారిని వదిలిపెట్టి నియోజకవర్గం అంతటా కొత్త వారిని ప్రోత్సహిస్తూ,దళారులను ఏర్పాటు చేసుకొని,అక్రమ సంపాదనకు మరిగి వారికే అన్ని రకాలుగా సహకారం అందించటంతో ఆది నుండి పార్టీకి సేవ చేసిన వారు ఒకింత నిరాశ నిస్పృహలకు లోనయ్యారు.ఎలాగోలా నాలుగున్నర సంవత్సరాలు గడిచి పోయింది…కేసీఆర్ అసెంబ్లీ ని రద్దు చేయడం తో ఈసారైనా స్థానికుడు,ఆది నుండి పార్టీకి సేవ చేసిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామెల్ కి పార్టీ టికెట్ లభిస్తుందని ఆశించారు..కాని నిన్న ముఖ్యమంత్రి ప్రకటించిన అభ్యర్థుల లిస్టు లో మళ్ళీ తాజా మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కి టికెట్ ఇస్తున్నట్లు ప్రకటన రావటం తో తుంగతుర్తి నియోజకవర్గం లో నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు…ఈ రోజు తిరుమలగిరి లో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని,గాదరి కిషోర్ కి టికెట్ ఇస్తే,ఎట్టి పరిస్థితిలో సహకరించమని,కిషోర్ ని కచ్చితంగా ఓడించి తీరుతామని ప్రకటించారు…ఆది నుండి ఉద్యమాన్ని నడిపించిన,స్థానికుడయిన మందుల సామెల్ కి టికెట్ ఇస్తే తుంగతుర్తి లో టిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇస్తామని తెలిపారు…కేసీఆర్ తన నిర్ణయాన్ని ఇప్పటికైనా పునపరిలించుకోవాలని,లేని పక్షం లో తుంగతుర్తి స్థానాన్ని కోల్పోవటం ఖాయమని,తుంగతుర్తి లో టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని హెచ్చరించారు…ఈ కార్యక్రమం లో తిరుమలగిరి మార్కెట్ చైర్మన్,తిరుమలగిరి,అర్వపల్లి,శాలిగౌరారం జెట్పిటిసి లతో పాటు 20 మంది mptc లు,అనేక మంది సర్పంచులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com