Eenadu.us

The Complete News Site

టిఫిన్ చేయడానికి వచ్చిన పాపానికి

హైదరాబాద్….అర్ధరాత్రి ఆకలి భరించలేక టిఫిన్ చేయడానికి వచ్చిన పాపానికి,ఇడ్లీ త్వరగా ఇయ్యండి అన్నందుకు ముగ్గురు యువకులు పై అర్ధరాత్రి 3గంటల సమయంలో టిఫిన్ సెంటర్ యజమాని మరియు టిఫిన్ సెంటర్ లో పని చేసే సిబ్బంది ముకుముడిగా పిడుగుద్దుల వర్షం కురిపించి,ఇనుప రాడ్ తో దాడి చేసారు,

వివరాల్లోకి వెళితే చదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్గొండ x రోడ్స్ చంచల్ గూడ ప్రధాన రహదారి పై చదర్ ఘాట్ మైత్రి కమిటీ మెంబర్ హాబీబ్ టిఫిన్ సెంటర్ పేరు తో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు,అర్ధరాత్రి 3 గంటల సమయంలో టిఫిన్ చేసేందుకు వచ్చిన కర్మన్ ఘాట్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు అశ్విన్,కిరణ్,మోహన్ లు టిఫిన్ చేసేందుకు వచ్చారు, టిఫిన్ త్వరగా ఇచ్చే విషయం లో యువకులకు మరియు టిఫిన్ సెంటర్ యజమానికి మధ్య వాగ్వివాదం జరగడం తో, కోపగ్రతులైన టిఫిన్ సెంటర్ సిబ్బంది యజమాని కలిసి ముగ్గురు యువకులను చితకబాది రాడ్ లతో దాడి చేశారు, సమాచారం అందుకున్న చదర్ ఘాట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు దెబ్బలు తగిలి ఉన్న ముగ్గురు యువకులను పోలీస్ స్టేషన్ తరలించారు, అనంతరం ముగ్గురి పై కేసు నమోదు చేశారు, అర్ధరాత్రి 3 గంటల సమయం లో గొడవ జరిగితే ముగ్గురు యువకులను పోలీస్ స్టేషన్ లో పెట్టి ఉదయం విషయం మీడియా కి తెలిసింది అని ఉదయం 8.30 గంటల ప్రాంతం లో ముగ్గురు యువకులను ఆసుపత్రికి కి పంపించారు .

సంఘటన అనంతరం ఆసుపత్రికి తరలించాల్సిన పోలీసులు ఉదయం వరకు ముగ్గుర్ని పోలీస్ స్టేషన్ లోనే పెట్టారు….

పోలీసులకి 24గంటలు అందుబాటులో ఉండి, నిరంతరం వారికి సేవాలందిస్తూ మైత్రి కమిటీ మెంబర్ @ టిఫిన్ సెంటర్ యజమాని హాబీబ్ పై ఎలాంటి కేసు నమోదు చేయని చదర్ ఘాట్ పోలీసులు.

అర్ధరాత్రి తెరిచి పెడుతున్న టిఫిన్ సెంటర్లు హోటళ్ల పై కేసులు నమోదు చేయకుండా ఆకలి తో తినడానికి వస్తున్న వారిని పోలీసులు వేధించడం సరి కాదని ఆందోళన చెందుతున్నారు,గతం లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినా అవి పోలీస్ స్టేషన్ వరకు రాకుండ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి…..

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com