Eenadu.us

The Complete News Site

రూ.149తో సరికొత్త ప్లాన్‌ను ప్రకటించిన ఐడియా

న్యూఢిల్లీ: వొడాఫోన్-ఐడియా విలీనం చర్చలు చివరి దశలో ఉన్న సమయంలో ఐడియా మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం రూ.149తో వాయిస్ టారిఫ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. కాలపరిమితి 21 రోజులు మాత్రమే. ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్.. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ రూ.98 ప్లాన్‌కు పోటీగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. అవి 28 రోజుల కాలపరిమితితో అందిస్తుండగా ఐడియా తాజా ప్లాన్ కాలపరిమితి మూడు వారాలే కావడం గమనార్హం.
ఐడియా రూ.149 ప్యాక్‌లో అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ అందిస్తున్నప్పటికీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాయిస్ కాల్స్ రోజుకు 250 నిమిషాలకు మించకూడదు. వారానికి వెయ్యి నిమిషాల నిబంధన ఉంది. కాలపరిమితిలో వంద నంబర్లకు మాత్రమే కాల్స్‌కు అనుమతిస్తారు. ప్రస్తుతం ఇది కొన్ని సర్కిళ్లలోనే అందుబాటులో ఉండగా, త్వరలోనే అన్ని సర్కిళ్లకు విస్తరించనున్నారు.

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com