Eenadu.us

The Complete News Site

మోదీ చదివేవన్నీ రాసిన స్క్రిప్టులే: రాహుల్

న్యూదిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చే ఇంటర్వ్యూల్లో రాసి ఇచ్చిన స్క్రిప్టులే చదువుతారని సోమవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. గత శుక్రవారం సింగపూర్‌లో మోదీ పాల్గొన్న ఇంటర్వ్యూను ఉద్దేశించి ట్విటర్‌ ద్వారా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతవారం మోదీ సింగపూర్, ఇండోనేషియా, మలేషియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా సింగపూర్‌ నాన్యాంగ్‌ టెక్నలాజికల్ యూనివర్సిటీలో మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘బహిరంగంగా సభలో అప్పటికప్పుడు ప్రశ్నలను అడిగి తీసుకొన్న వ్యక్తి మోదీ. ఆ ప్రశ్నలకు వెంటనే అనువాదం చేసిన సమాధానాల స్క్రిప్ట్ సిద్ధంగా ఉంటుంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ‘మంచిది, ఆయన నిజమైన ప్రశ్నలు తీసుకోలేదు. ఒకవేళ అదే జరిగిదే నిజంగానే పరువుపోయేది’ అని ఆయన ఎద్దేవా చేశారు. ఇదే విషయంపై కాంగ్రెస్‌ నాయకుడు థరూర్‌ కూడా మోదీని విమర్శించారు. అయితే ఆడియన్స్‌ ఎదురుగా ఉన్నప్పుడు మోదీ ఇంటర్వ్యూలో పాల్గొనడం ఇదే మొదటిసారి కాదు. దానిపై విమర్శలు రావడం కూడా ఇదే తొలిసారి కాదు. ఏప్రిల్‌లో లండన్ పర్యటన సందర్భంగా ఆడియన్స్‌ ఎదురుగా మోదీని ప్రసూన్‌ జోషి ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com