Eenadu.us

The Complete News Site

బెల్టుషాపు యజమాని నకిలీ మద్యం తయారీ

మద్యం షాపులో మద్యం కొని అమ్మడం తో వచ్చేలాభం సరిపోదనుకున్న ఓ బెల్టుషాపు యజమాని ఏకంగా నకిలీ మద్యం తయారీ ప్రారంభించాడు.

నకిలీ మద్యాన్ని పాత సీసాల్లో నింపి బెల్టుషాపులో అమ్ముతున్న నిందితుడు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయి గ్రామం లో జరుగుతున్న సంఘటన.

విశ్వసనీయంగా అందిన సమాచారం తో బెల్టుషాపు పై దాడిచేసిన రాజేంద్రనగర్ ఎక్సైజ్ సిబ్బంది కల్తీ మద్యం స్వాధీనం చేసుకుని నిందితుడి తోపాటు అతనికి సహకరించిన మరో నలుగురిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ అధికారులు.

రాజేంద్రనగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన శంషాబాద్ జోన్ ఎక్సైజ్ డిసిపి ఖురేషి.

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా ప్రాంతానికి చెందిన వీరబాబు గత 10 ఏళ్లుగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయి గ్రామం లో నివాసం ఉంటూ బెల్టుషాపు నిర్వహిస్తున్నాడు.

పరిసర ప్రాంతాల్లోని మద్యం షాపుల నుండి మద్యం తెచ్చి అమ్మడం ద్వారా లాభం తక్కువ గా వస్తుందని భావించి తానే మద్యం తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు.

అందుకుగాను అదే ప్రాంతంలో ఉన్న బగ్గా డిస్టిలరీ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది తో స్నేహం పెంచుకున్నాడు.

బగ్గా డిస్టిలరీ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న వినోద్ కృష్ణ తోపాటు మరో ముగ్గురు వీరబాబుకు నకిలీ మద్యం తయారీ లో సహకారం అందించారు.

మద్యం తయారీ లో ఉపయోగించే ఆల్కహాల్ తోపాటు ఇతర ఎసెన్స్ ను దొంగతనంగా బగ్గా కంపెనీ నుంచి తెచ్చి వీరబాబు కు అందించేవారు.

బగ్గా కంపెనీ నుంచి వచ్చిన ఆల్కహాల్ తో మద్యం తయారు చేసిన తర్వాత ఆమద్యాన్ని పాత మద్యం బాటిల్లు కొని అందులో నింపి సీలువేసి తన బెల్టుషాపు లో విక్రయించే వాడు.

విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు బెల్టుషాపు పై దాడిచేసిన రాజేంద్రనగర్ ఎక్సైజ్ సిబ్బంది నిందితుల వద్ద నుండి 60 లీటర్ల నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న వీరబాబు తోపాటు అతనికి సహకరించిన బగ్గా కంపెనీ కి చెందిన వినోద్ కృష్ణ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

అత్యంత సెక్యూరిటీ లో డిస్టిలరీ కంపెనీలు మద్యం తయారు చేసి డిపోలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. మద్యం కంపెనీ పూర్తిస్థాయిలో ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లో ఉంటుంది. కంపెనీ లోకి ఏదైనా సరుకు రావాలన్నా బయటకు పోవాలన్నా కంపెనీ ఆవరణలో ఉండే ఎక్సైజ్ అధికారుల ధృవీకరణ తప్పనిసరి. అలాంటిది గత ఆరునెలలు గా ఆల్కహాల్ చోరీ అవుతున్నా ఎక్సైజ్ అధికారుల కు తెలియక పోవడం గమనార్హం.

కాగా ఈ విషయమై ఉన్నతాధికారులకు రిపోర్టు చేయడం తోపాటు బగ్గా కంపెనీ కి సైతం నోటీసులు ఇవ్వనున్నట్లు పేర్కొన్న ఎక్సైజ్ డిసిపి ఖురేషి

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com